సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశం శనివారం కూకట్పల్లిలో ఎన్ కె ఎన్ ఆర్ గార్డెన్స్ లో వినోద్ సాంఘిక సంక్షేమ శాఖ, విజయ్ కుమారి డిస్టిక్ ఎడ్యుకేటివ్, హనుమంత్ డిప్యూటీ కమిషనర్, స్వామి కూకట్పల్లి ఎంఆర్ఓ, శ్రీనివాస్ బాల్నగర్ ఎమ్మార్వో, రవీంద్ర మండల్ ఎగ్జిక్యూటివ్, సుబ్బారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అధికారుల తో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక సమస్యలు మరియు అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం, ఈ సమావేశ లక్ష్యం అంటూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలు రైతుభరోసా ఇందిరమ్మఇళ్లు మహాలక్ష్మి గృహజ్యోతి సన్నరకం వరి బోనస్ చేయూతపెన్షన్లు కల్యాణలక్ష్మి తదితర పథకాలతోపాటు భవిష్యత్తులో అమలు చేయబోయే పథకాలగురించి అధికారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి పార్టీ తరఫున హాజరైన టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు మాట్లాడుతూ ప్రజలే కేంద్రంగా పారదర్శకత ధ్యేయంగా ప్రజల భాగస్వామ్యంతో స్థానిక అభివృద్ధి అవసరాల గుర్తింపు తద్వారా వాటి పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య నేరుగా సత్సంబంధాల కోసం ఈ కార్యక్రమం తోడ్పడుతుందన్నారు కార్యక్రమంలో విద్యాశాఖ రెవెన్యూ సిఎంసి పోలీసు తదితర శాఖల అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కావున నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ , డివిజన్ అధ్యక్షులు ,బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు ,సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.