శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి గారిని కలిసి కూకట్పల్లి నియోజకవర్గం కైతలాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలకు.. అలాగే కూకట్పల్లి నియోజకవర్గంకు చెందిన విలేకరులకు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అమృత నగర్ తండావాసులకు 62 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని.. అలాగే మిగిలినవి స్థానికులకు కేటాయిస్తూ మరియు పత్రికా విలేకరులకు కేటాయించాలని కలెక్టర్ ని కోరామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు.. డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు తులసిరావు తదితరులు పాల్గొన్నారు…

About The Author