పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి.

పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా ఉంటుందన్నారు. సమాజం కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సీఎం తెలిపారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో నిర్వహించిన పోలీసు స్మారక పరేడ్ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి, అమరవీరులను నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది ఏడాది 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని అన్నారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ మార్పులు చేసుకుంటోందని సీఎం కొనియాడారు.

2028 నాటికి పోలీసుశాఖలో అన్ని ఖాళీలు భర్తీచేస్తాం..
పోలీసుశాఖను బలోపేతం చేసేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 4,773 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామన్న ఆయన పోలీసుశాఖలో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చామని వెల్లడించారు. మిగతా ఖాళీలను కూడా విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పారు. 2028 నాటికి పోలీసుశాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 112 మంది డీఎస్పీలను డ

About The Author

Leave a Reply