బండి రమేష్ గారి సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి కూకట్పల్లి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్ గారు.

ఈరోజు బుధవారం కూకట్‌పల్లిలోని శ్రీ హేమ దుర్గా భవన్‌లో ఉన్న కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ గారి సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి కళాశాల విద్య కోసం రూ.15,000 (పదిహేను వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ గారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో బండి రమేష్ గారి సేవా సంస్థ ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు.

విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే గొప్ప ఆయుధమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం, విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడటం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య, కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షులు కావేటి నాగార్జున, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు రాజేష్ గౌడ్, నరసింహ యాదవ్, ముస్తఫా, రమణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా బండిరమేష్ గారి సేవా సంస్థ నిరంతరం ప్రజలకు అండగా నిలుస్తోంది.

About The Author

Leave a Reply