గాజుల రామారం ప్రభుత్వ భూములను రక్షించాలి.

గాజుల రామారం ప్రభుత్వ భూములను రక్షించాలి. పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా బడా బాబుల భరతం పట్టండి….
@@ పేదలకు డాబుల్ బెడ్రూంలు కట్టివ్వండి..
@@ సర్వే నంబర్ 307 లోని ప్రభుత్వ భూములలో వెలిసే వెంచర్లలో స్థలాలు..ఫ్లాట్ లు కొని మోసపోవద్దు…
@@ హైడ్రా కమిషనర్ ను కలిసి కోరిన ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు..ఎంఎల్సీ దాసోజు శ్రవణ్…

హైడ్రా కమీషనర్ రంగనాథ్ ను కలిసి గాజుల రామారం 307 సర్వే లోని ప్రభుత్వ భూములను కాపాడాలని కోరిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రవణ్..

మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే

గాజుల రామారం గ్రామంలోని 307 సర్వే నెంబర్ లోని 317 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని అన్ని డిపార్ట్మెంట్ లకు వినతిపత్రం ఇచ్చాం. సంబంధిత తహసీల్దార్ మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు విజిలెన్స్ నుంచి హైడ్రా వరకు అన్ని సంస్థలకు కూడా గాజులరామారం లోని ప్రభుత్వ భూములను రక్షించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేయడం జరిగింది. 307 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూముల్లో చోటు చేసుకున్న అక్రమాలను వెలికితీయడమే కాకుండా ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయొద్దని కోరుతూ జీ హెచ్ ఎం సి కమిషనర్ కు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంతే కాకుండా గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాము.

కొందరు బడా భూస్వాములు , పారిశ్రామిక వేత్తలు, భవన నిర్మాణ దారులు ఇక్కడి ప్రభుత్వ భూములను ప్రైవేట్ పట్టా భూములుగా నమ్మిస్తూ తప్పుడు పత్రాలను సృష్టించి వేలకోట్ల విలువ చేసే భూములను స్వాధీనం చేసుకున్న విషయం ఇటీవల హైడ్రా కూల్చివేతలలో బయటపడింది.
నెల క్రితం హైడ్రా కమీషనర్ ను కలిసి ఇదే విషయమై కంప్లెయింట్ ఇవ్వడంతో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు.
హైడ్రా కంచె వేసిన తర్వాత కూడా కొందరు దౌర్జన్యంగా తొలగించి మళ్ళీ కబ్జా చేస్తున్నారు. అందులో పనులు కూడా చేస్తూన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన పెద్దలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఫెన్సింగ్ తొలగించిన వారిపై ఎందుకు కేసులు పెట్టకుండా తాత్సారం చేయడం వెనుక అధికారులకు ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించడం జరిగింది. వెంటనే గాజుల రామారం లోని ప్రభుత్వ భూములను కాపాడాలని అందులో పేదల ఇళ్ల జోలికి పోకుండా పేదలకు అక్కడే పక్కా ప్రభుత్వ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, కుత్బుల్లాపూర్ తో పాటు కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని పేదలకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
307 సర్వే నెంబర్లో వెంచర్ల లో ప్రజలు ఎవరు భూమి కొనవద్దని కోరుతున్నాము…
ఈ ప్రభుత్వ భూమిని డబుల్ బెడ్ రూమ్స్ కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
శ్రవణ్, ఎమ్మెల్సీ
గాజుల రామారం లోని 307 సర్వే నంబర్ లోని వేల కోట్ల విలువ చేసే 320 ఎకరాల భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కబ్జా చేశాడు. అతనితో పాటు అనేకమంది పెద్దలు ఇక్కడి భూముల్లో వెంచర్లు వేశారు.
ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావ్ పోరాటం చేస్తున్నారు.
ఆ భూమిని కాపాడాలని హైడ్రా కమీషనర్ ను కలిసి కోరాం. రంగనాథ్ గారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు పార్టీలు మారి అధికార పార్టీలోకి వెళ్లిన వారిని ముఖ్యమంత్రి కాపాడుతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా అడ్డుపడుతూ కబ్జాదారులకు ముఖ్యమంత్రి కొమ్ముకాస్తున్నారు. ప్రజలెవరూ ఇక్కడి ప్రభుత్వ భూములను కొని మోసపోవద్దని కోరుతున్నాము.

Leave a Reply