ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారాలకు మార్గం

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో వర్షాకాలం నేపథ్యంలో ఏర్పడే సమస్యలను నివారించేందుకు డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ శ్రీమతి సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ గౌసుద్దీన్ గారు, జలమండలి జనరల్ మేనేజర్ హరిశంకర్ గారు, డీజీఎం శివ గారు, మేనేజర్ జఖీ గారు, విలియం ప్రకాష్ గారు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారి ఏఈ రంజిత్ గారు పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ,
“వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండానే వర్షపు నీరు సాఫీగా నదులలోకి పోయేలా ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టాము. అవసరమైన చోట తక్షణమే మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు.
అలాగే ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారాలకు మార్గం సుగమం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరారెడ్డి,సయ్యద్ రియాజ్, అబ్దుల్ హమీద్, అస్లమ్ బేగ్, మల్లేష్ , సలావుద్దీన్,షేక్ రఫీక్, నర్సింహా రెడ్డి, సలీం, మహమ్మద్, మల్లికార్జున్, గౌస్, యోగి రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply