డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చ.
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు బాలాజీ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పర్యవేక్షించారు.. అలాగే అంబేద్కర్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యపై కోర్టు అసోసియేషన్ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించే దిశగా సూచించారు .. ఈ నేపథ్యంలో అధికారులు ఎస్ టి పి ప్లాంట్ వద్ద సబ్ స్టేషన్ కొరకు స్థల అనుమతుల కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారిని కోరగా పరిశీలించి కచ్చితంగా అందిస్తామని తెలిపారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ .టి. పి ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే నియోజకవర్గంలోని మరుగునీటి సమస్యకు పరిష్కారమయి అలాగే దోమల బెడద కూడా తగ్గుతుందని.. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో కుకట్పల్లి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో ఎస్టిపి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామని.. ఇందులో భాగంగానే అవి పూర్తయ్యే దశకు చేరుకున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు.. డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు…


