మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారిని కలిసి 26+1 బీసి కులాల అసోసియేషన్ సభ్యులు*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు తన నివాసం వద్ద ఈ రోజు 26+1 ఉపకులాల అసోసియేషన్ సభ్యులు కలిశారు.. తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీసి జాబితా నుండి తొలగించిన 26+1 ఉప కులాలను మళ్ళీ బీసి జాబితాలో చేర్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి బీసీ జాబితాలో చేర్చేలా కృషి చెయ్యాలని ఆ ఉపకులాల అసోసియేషన్ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారిని కోరడం జరిగింది..
అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ కూనమనేని సాంబశివరావు గారు కూడ ఈ సమావేశంలో పాల్గోని గత బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయాన్ని కూన శ్రీశైలం గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి ఈ సమస్యలు పట్ల వివరిస్తాం అన్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..
✅ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 26+1 ఉప కులాలను బీసీ జాబితా నుండి తొలగించి తీవ్ర అన్యాయం చేసిందాన్నారు..
✅ 2014 నుండి ఆ కులాల కుటుంబల విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో 11 సంవత్సరాలు కోల్పోయిన రిజర్వేషన్ బాధ్యత వహించాల్సింది ఎవరని ప్రశ్నించారు..
✅ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన ప్రకారం,ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట నిలపెడుతారని.. ఈ సమస్య పట్ల ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి న్యాయం జరుగేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు..
✅ అణగారిన వర్గాల ఆపద్బాంధవుడు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. ఇచ్చిన మాట కోసం బీసీ ప్రజల అభ్యున్నతి కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల, జన గణన చేసిన మొట్టమొదటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని గుర్తుచేశారు..
ఈ కార్యక్రమంలో ఉపకుల అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..