డ్రైనెజ్ వ్యర్ధాల ను తొలగించాలి
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్, సర్దార్ నగర్ లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు మెడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గార్లు, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారి ఏఈ రంజిత్ వర్క్ ఇన్స్పెక్టర్ బలరాం, జలమండలి అధికారులు అన్వేత్, జాకీర్, గార్లతో కలిసి పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నాలాలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, యోగరాజస్వామి ముత్యాలదుర్గ, తదితరులు పాల్గొన్నారు.