హోప్ ఆఫ్ హంగర్ ఆధ్వర్యంలో తోపుడు బండి, వీల్ ఛైర్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకకురాలు ఆలేఖ్య గారి ఆధ్వర్యంలో కందుకూరి రేఖకు తోపుడు బండి, వికలాంగుడు బాల్ రెడ్డి కి వీల్ ఛైర్ మాజీ ఎమ్మెల్యే గారి చేతులమీదిగా అందజేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…
✅ మానవత దృక్పథంతో సమాజ సేవ చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుందన్నారు..
✅ హోప్ ఆఫ్ హంగర్ వ్యవస్థాపకురాలు ఆలేఖ్య గారు నియోజకవర్గంలో విద్యార్థులకు, వృద్దులకు, వికలాంగులకు, దివ్యాంగులకు ఆర్థిక సహాయం చేస్తూ పేదలకు చేయూతగా నిలుస్తుంది అన్నారు..
✅ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ పేదప్రజలకు అండగా నిలువలని వ్యవస్థాపకురాలు ఆలేఖ్య,భర్త రవికుమార్,తండ్రి వెంకటేశ్వర్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…
