కుట్టు మిషన్ల పంపిణీ అభినందనీయం…
ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు…
పేద ప్రజలకు అండగా ఉంటూ పేద కుటుంబాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం చేపట్టడంతో పాటు శిక్షణ పొందిన మహిళలకు కుట్టుమిషన్ లను అందించడం అభినందనీయమని కూకట్పల్లి ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఉదయం kphb కాలనీ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆలయ చైర్మెన్ చెరుకు కుమారస్వామి ఆధ్వర్యంలో సెల్ వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుబ్బారావు గారి సహకారంతో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో MLA ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు కుట్టు శిక్షణ కార్యక్రమంలో కుట్టిన పలు వస్త్రాలను, నూతన డిజైన్ డ్రెస్ లను పరిశీలించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, మిషన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుమారస్వామి , సుబ్బారావు అందిస్తున్న సేవలను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మిషన్ల పంపిణీ కార్యక్రమానికి తనవంతు సహకారం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు ఆరువేల మందికి కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నామని, నేర్చుకున్న వారికి ఉచితంగా మిషన్లను కూడా అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళలందరికి ఉపయోగపడేలా సుమారు నాలుగువేల గజాల స్థలాన్ని కూడా ఎంపిక చేసి కేటాయింపుకు కలెక్టర్ కు లేక రాయడం జరిగిందన్నారు. స్థలం కేటాయింపు జరిగితే మహిళకు మంచి భవనం నిర్మించి అందులోనే మహిళా బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి పలు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను అందించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. దురదృష్ట వశాత్తు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రాలేదని, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తప్పకుండా స్థలాన్ని కేటాయించి మహిళలకు భవనం నిర్మించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు బొడ్ల గోపాల కృష్ణ, కృష్ణమూర్తి, స్థానిక నాయకుడు కచిన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.