అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు ఏరియాలలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది..

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రామారావు నగర్, పర్వత్ నగర్, శ్రీ వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో ఉన్నప్పుడు డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గార్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అన్ని రంగాల్లోని ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని అంబేద్కర్ చేసిన పోరాటాలను ప్రజలందరికీ తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి ఎంతగానో కృషి చేశారని. స్వాతంత్రానంతరం భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గాను రాజ్యాంగ రచనలు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి నాగుల సత్యం, నరసింహ మాస్టర్, నూర్ ఖాన్, సూర్య ప్రకాష్, పి శివ, యేసు రత్నం, కృష్ణ, సతీష్, తడెం కృష్ణ, జీవరత్నం, యాది, అన్ని బస్తి మరియు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, సీనియర్ నాయకులు, ఏరియా సభా సభ్యులు, వార్డు సభ్యులు, మహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply