30 రోజుల్లో వెళ్ళిపోతే మీకే మంచిది*
లేదంటే అరెస్టు జరిమానా – ట్రంప్ హెచ్చరిక

ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్ లు విధించి ఆ దేశాల్ని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్ ఇచ్చింది ట్రంప్ ఆధ్వర్యంలోని యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్.
30 రోజులకు పైబడి ఉంటున్న వారు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. లేని పక్షంలో జరిమానా విధించడం, అరెస్టు చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు హెచ్చరించారు. 30 రోజులకు పైగా ఉన్నవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని.. నమోదు చేసుకోని వారికి కఠిన శిక్షలు పడతాయని స్పష్టం చేసింది.
అమెరికాలో 30 రోజులకు పైగా ఉన్న విదేశీయులకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిపోయింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రకారం.. ఏప్రిల్ 11 తర్వాత అమెరికాకు వచ్చే విదేశీయులు 30 రోజుల్లోపు వేలిముద్రలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చేయకపోతే నిబంధనల ప్రకారం అధికారులు ఆర్డర్ పాస్ చేశాక ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్ విధించవచ్చు. ఆ తర్వాత కూడా వెళ్లకుంటే తర్వాతి రోజు నుంచి వేయి నుంచి 1500 యూఎస్ డాలర్ల జరిమానా విధించడం జరుగుతుంది. అయినా వెళ్లని పక్షంలో జైల్లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా నమోదు చేసుకోని విదేశీయులను అమెరికా నుండి కూడా బహిష్కరించే నిబంధన ఆ చట్టంలో ఉంది.
ఈ మేరకు సొంతంగా అమెరికాను వీడిపోవడమే ఉత్తమమైన మార్గమని అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వెల్లడించింది. ఎలాంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని వెళ్లాలని తెలిపింది. విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని ఈ మేరకు అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ ద్వారా తెలిపింది.

Leave a Reply