పారిశ్రామిక వేత్తలకు అండగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు
కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లోని రాజస్థాన్ కి చెందిన చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అత్యధికంగా అన్నిటికీ టాక్స్లు విపరీతంగా పెంచిందని ముఖ్యంగా మున్సిపల్ టాక్స్ మూడు రెట్లు అధికంగా పెంచారని.. ఏమన్నా అడుగుతుంటే లంచాలు డిమాండ్ చేస్తున్నారని…దీంతో వ్యాపారాలు నిర్వహించుకోవడం చాలా కష్టతరమవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారిని కలిసి తెలిపారు..ఈ సందర్భంగా వారికి అండగా ఉండేందుకు ఆదివారం కూకట్పల్లి ప్రశాంత్ నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం లోని వారి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మీరు ధైర్యంగా ఉండాలని ఇక్కడున్న వారంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారేనని.. మీ సమస్యలపై కచ్చితంగా పోరాడి మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు… అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, చిన్న తరహా పరిశ్రమ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు..
