అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్.
అక్రమ నిర్మాణాలపేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో యాభైకి పైగా భవనాలను సీజ్ చేసిన విషయమై భవన నిర్మాణదారుల ఆవేదనను MLA మాధవరం కృష్ణారావు గారు గురువారం ghmc కమిషనర్, అడిషనల్ సీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. MLC ఎన్నికల కోడ్ దృష్ట్యా కమిషనర్ ను కలవకుండా స్థానిక భవన నిర్మాణ దారులను పంపి కమిషనర్ దృష్టికి వారి సమస్యలను తీసుకువెళ్లారు..అనంతరం ఎంఎల్ఏ స్వయంగా అడిషనల్ సిసిపి ని కలిసి స్థానికంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అనుసరిస్తున్న తీరును వివరించారు. అసమగ్ర విధానాలతో భవన నిర్మాణ దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఒక్కో సర్కిల్ పరిధిలో ఒక్కో విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. kphb డివిజన్ పక్కన ఉన్న గోకుల్ ప్లాట్స్ లో ఒకరకంగా, బాలాజీనగర్ డివిజన్ పక్కనే ఉన్న అయ్యప్ప సొసైటీ లో ఒకవిధంగా వ్యవజరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం ఏకంగా భవనాలను సీజ్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం అనుమతులు కూడా లేకుండా పక్క సర్కిళ్లలో చేపడుతున్న నిర్మాణాలను చూసి చూడకుండా వదిలేస్తున్నారని. కూకట్పల్లి లో మాత్రం సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులకు మించి చేపట్టిన నిర్మాణాలను మాత్రమే సీజ్ చేయకుండా అనుమతులు ఉన్న ఫ్లోర్ లను కూడా సీజ్ చేయడం సరికాదన్నారు. అధికారులు ghmc మొత్తానికి ఒకేవిధమైన పద్ధతులను అనుసరించాలని లేకపోతే పెద్దయెత్తున ప్రజలకోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికారులు డబ్బులు తీసుకొని కూడా భవనాలను సీజ్ చేస్తున్నారని. వసూళ్ళకోసం టీమ్ లను ఏర్పాటు చేసుకొని నిర్మాణదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. పలువురు భవన నిర్మాణ దారులతో మాట్లాడించి వారి భాదాలను అధికారులకు వివరించారు. వెంటనే స్పందించి భవనాలకు వేసిన సీల్ ను తొలగించాలని కోరారు. అదనపు అంతస్తులకు సీల్ వేసుకున్న ఇబ్బంది లేదని, అనుమతులు ఉన్న వాటిని నిర్మాణదారులు వినియోగించుకునేలా చూడాలని కోరారు..
అంతకు ముందు జోనల్ కమిషనర్ కార్యాలయం కు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ దారులతో కలిసి ghmc ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులకు సమస్యలను వివరించారు…