అంబీర్ చెరువు & ప్రకృతిని కాపాడాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను మనవి.

ఈ రోజు అంబీర్ చెరువులో కోళ్లు మరియు చేపల వ్యర్థ పదార్థాలను పారవేయడం, నాన్-వెజ్ వ్యర్థాల వాహనాలను శుభ్రం చేయడం గురించి స్థానికుల నుండి అందిన సమాచారం ప్రాకారం, అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి BRS పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు ఉప్పు జస్వంత్ స్వయంగా వెళ్లి పరిశీలించటం జరిగింది, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి పొందామని వాహనదారులు చెబుతున్నారు, ఒకవైపు ఇరిగేషన్ శాఖ అంబీర్ చెరువును కాపాడమని మున్సిపల్ అధికారులను కోరుతోంది, అంబీర్ చెరువును నాశనం చెస్తున్న వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మన అంబీర్ చెరువు & ప్రకృతిని కాపాడాలని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ను మనవి చేస్తున్నాము.