ఈ నెల 19 తేదీ నుండి జరగబోయే శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవి జాతర కు ఏర్పట్లు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఈ నెల 19 తేదీ నుండి జరగబోయే శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవి జాతర వేడుకల సందర్భంగా శాంతి భద్రతల పట్ల మరియు గుడికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు మరియు అడ్వైసర్లు కలసి డీసీపీ,పోలీస్ సిబ్బందికి సూచించారు..
ఈ సమావేశంలో కూన శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ అంతయ్య గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, అడ్వైసర్లు పాల్గొన్నారు..