ప్రజలంతా సంతోషాలతో ఉండాలి..
సబీహా గౌసుద్దీ

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు రాక్ మౌంట్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంక్రాంతి పండుగ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ భారతదేశంలో జరుపుకునే ప్రధాన పండుగలో సంక్రాంతి ఒకటని పాడిపంటలు బాగా పండాలని దేశ ప్రజలంతా సంతోషాలతో ఉండాలి అని సూర్యభగవానుని వేడుకుంటూ జరుపుకునే పండగని, ఈ పండుగ ప్రాధాన్యతను ఈ తరం విద్యార్ధులకు తెలియజేయటం కోసం పండుగ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. అలాగే అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రియాజ్, రాంబాబు, అస్లాం, కృష్ణ, మల్లేష్, శమా, రేణుక, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply