శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో ఉద్యమకారులు శ్రీకాంత్ మరియు కూకట్పల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటుగా 50 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అబద్ధపు హామీలు బూటకపు మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు తిరిగి మళ్లీ గులాబీ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో ఉద్యమకారులు శ్రీకాంత్ మరియు కూకట్పల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటుగా 50 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో పేద ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన ఇప్పటివరకు పెన్షన్లు పెంచలేదని అందించాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా సంవత్సరం ముగిసిందని ప్రభుత్వం విజయోత్సవ సభలు చేసుకుంటున్నారు. ప్రజలకు ఏమి చేశారని ఏ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారని సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకొని ఉద్యమకారులు ప్రజలు తిరిగి బిఆర్ఎ