డిసెంబర్ 7వ తేదీన జరగబోయే రాష్ట్రవ్యాప్త ఆటో బందును జయప్రదం చేయండి

డిసెంబర్ 7వ తేదీన జరగబోయే రాష్ట్రవ్యాప్త ఆటో బందును జయప్రదం చేయండి

ఈరోజు ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ముద్రించిన డిసెంబర్ 7వ తేదీన జరగబోయే ఆటో బంద్ పోస్టర్ను సిటీ ఆఫీస్ HMT నగర్ నాచారంలో BRTU రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య గారి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో TADS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి TUCI గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు లింగం గౌడ్ శాతం రమేష్ హైమద్ భాయ్ అక్కి రామాంజనేయులు తిరుమల్ కిషన్ శ్రీరామ్ సాయి మున్నా యాదవ్ కుమార్ ఉపేందర్ పాల్గొనడం జరిగింది

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ బంధు నిర్వహిస్తున్నాము కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బందులో పాల్గొని జయప్రదం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిసెంబర్ 9వ తేదీన జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలు చర్చకు వచ్చి పరిష్కారం దిశగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది