మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.1,800 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
యాంటీ టెర్రరిజం యూనిట్, యాంటీ నార్కోటిక్స్ యూనిట్ సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల భోపాల్‌లోని ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి ఎండీని, ఎండీ తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ను సీజ్ చేశారు. ఫ్యాక్టరీలో డ్రగ్స్ దాచి ఉంచిన ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.