వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..!
కాలనీల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ లో ఈ రోజు శివాజీ నగర్ సంక్షేమ సంఘం అద్వర్యంలో అక్షయ ఆకృతి ఎన్ జి ఓస్ వారి సోయేజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ సమాజ హితం కోసం చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. వైద్యుల సూచనలమేరకు ముందస్తు చెవి, ముక్కు, గొంతు, అలాగే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయ్ గౌడ్, తులసి రామ్, సంజీవ్ రెడ్డి, బాలయ్య, మదురాచార్య, గీత తదితరులు పాల్గొన్నారు.