మునిగిపోతున్న కార్గో షిప్ నుండి 11 మందిని రక్షించారు
మునిగిపోతున్న కార్గో షిప్ నుండి 11 మందిని కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. కోల్‌కతా నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరిన ఓ కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. రెండు ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు మరియు ఒక టోర్నియర్ విమానం ద్వారా 11 మందిని రక్షించారు. సాగర్ ద్వీపానికి దక్షిణంగా 90 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ నుంచి 11 మందిని రక్షించారు.