జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసి విజయం సాధించాలని.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేసి విజయం సాధించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు, ఎర్రగడ్డ డివిజన్ ముఖ్యనాయకులతో కూకట్పల్లి ఏమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన అంశాలపై చర్చించారు. కార్పొరేటర్లు అందరూ తమకు కేటాయించిన కాలనీలలో బూత్ లవారీగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి గత ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, నగరంతో పాటు తెలంగాణలో జరిగిన అభివృద్ధి వివరించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిఒక్కరు పనిచేయాలని సూచించారు. గల్లీ స్థాయిలో కార్నర్ మీటింగ్ లు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలని తెలిపారు. పాదయాత్రలు చేపట్టి ప్రజల్లో కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటిగా ఉన్నాయని బీఆర్ ఎస్ పార్టీ మాత్రమే ప్రజలకోసం తెలంగాణ కోసం పోరాడుతుందని అన్నారు.