ఆరోగ్య శ్రీ ద్వారా శ్రీ రామ రక్ష.
ప్రజా ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి పెద్దపీట.
ప్రజాస్వామ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందని బలమైన సమాజ నిర్మాణానికి దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో రెండు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో కోట్లాది మంది పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది.
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్ లోని సాయి నగర్ ప్రాంతానికి చెందిన పాలడుగు వెంకటకృష్ణా గారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలుసుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారి దృష్టికి తీసుకురాగా వారు వెంటనే వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని తక్షణమే స్పందించి సదరు వ్యక్తికి ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ₹8,80,000.00* విలువ గల చెక్కును శ్రీ బండి రమేష్ గారు వారి స్వగృహానికి స్థానిక నాయకులు కార్యకర్తలతో చేరుకుని వారికి ఆ చెక్కును అందించారు.
ఈ మహత్తరమైన సహాయం గురించి పధకం గురించి తెలుసుకున్న బాలానగర్ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షులు చందు గారు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరై ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేస్తూ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరియూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలును కొనియాడారు. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అన్ని పార్టీల నాయకులు అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టిడిపి నాయకుడు చిలుకూరి చందు, వినాయక నగర్ నగర్ అధ్యక్షుడు సిద్దు, లక్ష్మణ్ , పుష్ప రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, యుగేందర్ రెడ్డి, పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, శ్రీనివాస్ గౌడ్ , మధు, రామ్మోహన్రావు ,భరత్, నరేందర్, మహేందర్, రేణుక, సాయి భారతి స్థానిక నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.