HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసిన కార్పొరేటర్ సబీహా గౌసుధీన్ గారు.
కూకట్‌పల్లి నియోజకవర్గం – అల్లాపూర్ డివిజన్
కార్పొరేటర్ శ్రీమతి సబీహా గౌసుద్దీన్ గారు ఈరోజు HMWS&SB నూతన జనరల్ మేనేజర్ హరిశంకర్ గారిని కలిసి, ఆయనను ఘనంగా సన్మానించి, శాలువాతో సత్కరించారు. అనంతరం పర్వత్ నగర్, వివేకానంద నగర్, గాయత్రీ నగర్, పద్మావతి నగర్, సెంట్రల్ అల్లాపూర్, అల్లాపూర్, రామరావు నగర్, ఆర్.కే. నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న మంచినీటి సరఫరా సమస్యలపై చర్చించరు.
ఈ సమావేశంలో శివా డీజీఎం, అన్వేత్ కుమార్, జాకీ మరియు విలియం ప్రకాష్ మేనేజర్లు హాజరయ్యారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జావిదుద్దీన్, జుబేర్, తదితరులు పాల్గొన్నారు.