కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జన సమీకరణ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*

ఈరోజు సిటి ప్యాలస్,HAL కాలనీ, గాజులరామారంలో జరిగిన జన సమీకరణ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, శశికళ యాదవ రెడ్డి, గజ్జెల కాంతం, మిథున్ రెడ్డి,నియోజకవర్గం ఇంచార్జ్, గ్రంధాలయ చైర్మన్, పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..
✅ జులై 4న లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు..
✅ గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళన సభను విజయవంతం చెయ్యాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సంఘం నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,NSUI నాయకులు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply