ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా
ఎన్నిక ఏదైనా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాటం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారు పేర్కొన్నారు. ఈ నెల 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశo విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మంగళవారం పార్టీ నాయకులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ గారు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం హైదరాబాదులో జరగనున్న జైబాపు జై భీమ్ జైసంవిధాన్ కార్యక్రమానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.