పీజేఆర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు. శ్రీ బండి రమేష్ గారు.

సీఎల్పీ నాయకుడు మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారి సేవలను స్మరిస్తూ ఆదివారం బాలానగర్లోని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పిజె ఆర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి స్థానిక నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. పీజేఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడిగా పిజెఆర్ పేద ప్రజలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. అన్నా అంటే నేనున్నా అంటూ నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న పీజేఆర్ సదా చిరస్మరణీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అభిమానులు, మహిళ నాయకురాలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply