సేవలోకెల్ల అన్నదాన సేవా మిన్నా
జై ఆర్యవైశ్య సేవా సమితి
జూన్ 25వ తారీకు అమావాస్య రోజు సైట్ 3 లో అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగినది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి మెడికల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ శర్మగారు, ట్రెజరర్ బెజ్జాల నాగరాజ్ గుప్తా గారు, మరియు వాసవి కిరణాలు త్రినాధ్ గారు , వచ్చినారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించినారు వారికి అభినందనలు తెలియజేయుచున్నాము . మోతి నగర్, బోరబండ, సైట్ 3, మూడు ప్రదేశాలలో రెండు బ్రాంచీలలో ఒక వెయ్యి మంది పేద నిరుపేద కార్మికులకు అన్న ప్రసాదం అందించడం జరిగినది ఈ కార్యక్రమానికి సహకరించిన జై ఆర్యవైశ్య మిత్రులందరికీ పేరుపేరునా వారికి అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ వాసవి మాత ఆశీర్వాదములు ఎల్లవేళలా ఉండాలని కోరుకొనుచున్నాము మరియు రెండు బ్రాంచీలు మెయింటెనెన్స్ చేయడం చాలా చాలా గ్రేట్ నిజంగా మరోసారి మీ అందరికీ జై ఆర్యవైశ్య సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము.


