చెరువు అభివృద్ధి పనులు పరిశీలన గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు,

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్ధర్ నగర్ కాముని చెరువు అభివృద్ధి పనులను శుక్రవారం గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గారు, పరిశీలించారు. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారు మాట్లాడుతూ రానున్న వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని పనుల్లో నాణ్యత పరిమాణాలు పాటిస్తూ పనులు వేగవంతం చేయాలని హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహాయ సహకారాలతో డివిజన్ పరిధిలోని అన్ని బస్తి మరియు కాలనీలలో అధునాతన వసతులతో కూడుకున్నటువంటి అభివృద్ధి పనులను చేసుకోగలిగా అలాగే కామిని చెరువుని ఇంత అద్భుతంగా సుందరకరించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, షేక్ సలీం, షేక్ రఫీక్, జ్ఞానేశ్వర్, మల్లేష్, అస్లాం రాము యాదవ్, మోయిజ్, యోగరాజస్వామి నార్లపురం నాగరాజు, బాబా, తదితరులు పాల్గొన్నారు.