అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధి పరిశీలన.
శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, అన్ని విభాగాల అధికారులతో సున్నం చెరువు అభివృద్ధిపై ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు.. వర్షాకాలం వస్తున్న దృష్ట్యా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అలాగే అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్ది చుట్టూ మొక్కలు కూడా నాటాలని సూచించారు… జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్, హైడ్రాధికారులు సమన్వయం చేసుకునే పనులు పూర్తి చేయాలని తెలిపారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేయడానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు.. ఇందులో భాగంగానే ప్రతి చెరువులో కూడా మంచినీరు ఉండేటట్లు ఎక్కడకక్కడ ఎస్టిపి ప్లాంట్లు కూడా నిర్మిస్తున్నామని అవి కూడా పూర్తయితే శుద్ధి చేసిన నీరే ప్రవహిస్తుందని.. దీంతో దోమల బెడద కూడా తగ్గుతుందని వివరించారు… ప్రజలు కూడా చైతన్యవంతులై పరిశుభ్రత పాటించాలని ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేటట్లు చూసుకోవాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు ,జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు…