బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం .

బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి..
సర్దార్ ఇద్దరు పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించి, కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ గారు
♦️బోరబండ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు సర్దార్
♦️కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందంటే పేదల మీద జులుం చేయటం వస్తే మా పార్టీలోకి రా లేదంటే నీ అంతూ చూస్తామన్నట్టుగా వ్యవహరిస్తోంది.
♦️అరాచకాలను సృష్టిస్తూ అధికారం మత్తులో అధికారులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్పొరేటర్లు రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారు.
♦️హైదరాబాదులో హైడ్రా అనే దందా మోపు చేసినారు.
♦️రేవంత్ రెడ్డి రెడ్డి కుంటలో ఇల్లు కట్టుకుంటే కూల్చరు.. రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి FTL లో ఇల్లు కడితే కూలగొట్టరు.
♦️రేవంత్ రెడ్డి పార్టీలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు మనుషులు వాళ్ల FTL లో ఇల్లు ఉన్నా బఫర్ జోన్ లో ఉన్న హైడ్రా కళ్ళకు కనిపించదు.
♦️కుటుంబం పెరిగి ఇల్లు కట్టుకుంటే ఆటోలు కూడా రాని ప్రాంతంలోకి హైడ్రా వచ్చి అరాచకాలు సృష్టిస్తున్నారు.
♦️కేసీఆర్ ఉన్న పదేళ్లలో ఇక్కడున్న గరీబ్ వాళ్లకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించారు.
♦️భవిష్యత్తు తరాలు బాగుండాలని ఇళ్ల పట్టాలు ఇచ్చారు కేసీఆర్ గారు
♦️నోటరీ ప్రాపర్టీస్ రేగులరెైజ్ చేసేందుకు నాడు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం.
♦️రేవంత్ రెడ్డికి బుద్ది జ్ఞానం అంటే దీనిపై నిర్ణయం తీసుకోవాలి.
♦️పేదోడు ఇల్లు కట్టుకొని డాబా కట్టుకుంటే కూల్చడం, చంపడం లాంటివి చేస్తున్నారు
♦️లేదంటే వాళ్లే ఆత్మహత్య చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వ తీరు కనిపిస్తుంది.
♦️రాష్ట్రంలో ఎక్కడ అరాచకం జరిగిన ఒక పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులమంతా రోడ్లపైకి వచ్చి అడ్డుకుంటాం.
♦️హైడ్రా బాధితులకు మూసి, లగచర్ల వారికి అండగా నిలబడ్డాం.
♦️హైడ్రా బాధితులకు కూడా అండగా నిలబడ్డది మేమే ఇక ముందు కూడా నిలబడతాం.
♦️ఏ అధికారులైతే అతి చేస్తున్నారో, కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా ఆడుతున్నారో కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్న అధికారులకు ఇది మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు.
♦️వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది.
♦️మేము కూడా యాది పెట్టుకుంటాం.
♦️పదేళ్లలో అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టాం.
♦️పేదలు అందరూ మావాళ్లే అన్నట్టుగా పనిచేశాం.

Leave a Reply