రూ.7లక్షల 20 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్
కూకట్పల్లి నియోజకవర్గం లోని వివిధ డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 17 మంది లబ్ధిదారులకు సుమారు రూ.7లక్షల 20 వేల రూపాయల విలువ గల చెక్కులను ఆదివారం కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీ లోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు గారి కార్యాలయం వద్ద కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారు మరియు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు గార్లు లబ్ధిదారులకు అందజేశారు
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, గోవింద్ గౌడ్, R. వాసు మల్లేష్ యాదవ్, రాజు యాదవ్,రమణ, నరేందర్, బండి సుధ, జ్యోతి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి , GVRగారికి కృతజ్ఞతలు తెలియజేశారు.