చెరువులు అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదు.

కూకట్పల్లి నియోజకవర్గం లోని 9 చెరువులను అభివృద్ధిపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే స్థానికంగా ఉంటున్న ప్రజలకు, ఆ ప్రాంతంలో కొనుగోలు చేసిన వారికి ,పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి తగిన న్యాయం చేయాలని ఇటీవల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హైడ్రా కమిషనర్ రంగనాథుని కలిశారు.. ఈ నేపద్యంలో గురువారం హైడ్రాధికారులు కూకట్పల్లి నియోజకవర్గం లోని నల్లచెరువు,కాముని చెరువు ,సున్నం చెరువు ప్రాంతంలో పరిశీలించడం జరిగింది ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఎవరైతే ప్రజలు స్థానికంగా కొనుక్కున్నవారును మరియు పట్టాదారులకు తగిన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే టిడిఆర్ విషయంలో వారికి భరోసా ఇచ్చే విధంగా అధికారులతో మాట్లాడి సమస్యను కొలిక్కి తీసుకురావడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చేత మూడు పర్యాయాలు ఎన్నుకున్న కృతజ్ఞతా భావంతో ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా న్యాయం చేసే విధంగా వారికి అండగా ఉంటానని.. అలాగే చెరువులు అభివృద్ధి విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని అందుకే ఎవరికీ నష్టం లేకుండా చెరువులను అభివృద్ధి పరచాలని అధికారులకు తెలపడం జరిగిందని ఆయన అన్నారు…