30 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభం .
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ రోడ్ నెంబర్ -8,9,10, లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు నూతనంగా 30 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి సహాయ సహకారాలతో జిహెచ్ఎంసి నిధులు 30 లక్షల వ్యయంతో ఈరోజు శ్రీ వివేకానంద నగర్ లోని రోడ్ నెంబర్ 8,9,10, లలో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, బోల్లు శ్రీనివాస్ రావు, జ్ఞానేశ్వర్, రోణంకి జగన్నాథం, తుంగం శ్రీనివాసరావు, రవిందర్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, రామకృష్ణ, సుబ్బయ్య చౌదరి, వీరాంజనేయులు, శేషారావు, యోగి రాజు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.