మానవత్వం చాటుకున్న గుంటూరు – లాలాపేట పోలీసులు
నిన్న అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో కమ్మ శేషయ్య గ్రౌండ్ ఏరియాలో లాలాపేట పోలీస్ స్టేషన్ ASI, A. నరసింహరావు గారు గస్తీ నిర్వహిస్తుండగా, పక్కన ఉన్న నివాసగృహాల నుండి ఒక మగ మనిషి వచ్చి మా ఆవిడ నిండు గర్భిణీ , కాన్పూ నొప్పులతో ఇబ్బంది పడుతుందని , రవాణా సదుపాయం లేనందున, కొంచెం ఆస్పత్రికి తీసుకెళ్లమని అడగగా, వెంటనే స్పందించిన ASI గారు మరియు కానిస్టేబుల్ నాగరాజు ఆమెను రక్షకు వాహనంలో ఎక్కించుకొని ,గవర్నమెంట్ హాస్పిటల్ కాన్పుల వార్డు వద్దకు తీసుకొని వెళ్లి హాస్పటల్లో క్షేమంగా జాయిన్ చేసినారు.
గర్భిణీ స్త్రీ మరియు వారి కుటుంబ సభ్యులు పోలీసులుకు కృతజ్ఞతలు తెలియజేసి ఆనందం వ్యక్తపరిచినారు.