ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అన్న ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై డివిజన్లో వారిగా కార్పొరేటర్లతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని కలిసి సమస్యలు వివరించడం జరిగింది

శనివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నియోజకవర్గ కార్పొరేటర్లు తో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర గారిని కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు..ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రైల్వే లైన్లు, రోడ్లుకు సంబంధించి సమస్యలు పరిష్కరించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు.. ముఖ్యంగా అల్లాపూర్ లోని యూసఫ్ నగర్ స్మశాన వాటిక నుంచి గాయత్రీ నగర్ వరకురైల్వే అండర్పాస్ లైన్ అలాగే మూసాపేట్ నుంచి రాజీవ్ గాంధీ నగర్ వరకు లింకు రోడ్డు పునరుద్ధరించి దాని నిర్మాణానికి సంబంధించి మరియు గుడ్ షెడ్ రోడ్డు రోడ్ నుంచి గ్లాస్ ఫ్యాక్టరీ వరకు రైల్వే అండర్ పాస్ నిర్మాణం చేపట్టే విధంగా …అలాగే నియోజకవర్గంలో డ్రైనేజ్ మరియు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం.. ఇతర మౌలిక సదుపాయాల కొరకు నిధులు కేటాయించాలని కోరారు ..దీనికి ఈటెల రాజేందర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది ..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసిద్దీన్ .. మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్.. నాయకులు అంబటి శ్రీనివాస్ ,సత్యం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply