ఈ నెల 11 న ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.
కడప ఏప్రిల్ 10: ఈ నెల 11 న శుక్రవారం ఒంటిమిట్ట లో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్ళింపు ఈ నెల 11 వ తేదీ ఉదయం నుండి 12 వ తేది ఉదయం వరకూ అమలులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణ సందర్బంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాతీయ రహదారి-716 మీదుగా వచ్చు భారీ వాహనాలను రేణిగుంట, రాజంపేట, కడప వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా జాతీయ రహదారి-716 మీదుగా కాకుండా ఇతర మార్గాలలో 11వ తేది ఉదయం 06:00 గంIIల నుండి 12వ తేది ఉదయం 10 గంIIల వరకు దారి మళ్ళించడం జరుగుతుంది. రాజంపేట వైపు నుండి వచ్చు ద్విచక్ర వాహనాలు, ఆర్.టి.సి. బస్సులు ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ వద్ద మరియు సిద్ధవటం మండలం ఉప్పరపల్లి సాయిబాబా గుడి వద్ద 11 వ తేది మధ్యాహ్నం 12:00 గంIIల నుండి 12 వ తేది ఉదయం 10 గంIIల వరకు దారి మళ్ళించడం జరుగుతుందని ఎస్.పి తెలిపారు.
👉🏽 వాహనాల దారి మళ్లింపు వివరాలు:
కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుండి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి.
తిరుపతి నుండి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.
రాజంపేట వైపు నుండి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుండి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా పంపబడును.
👉🏽 18 చోట్ల పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు:
శ్రీ సీతారామ కళ్యాణానికి రాజంపేట వైపు నుండి వచ్చే భక్తులు టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను సాలాబాద్ సమీపంలో 5 చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో క్రమపద్ధతిలో నిలపాలి. కల్యాణ వేదిక నుండి కడప మార్గంలో 13 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.
👉🏽 కడప రహదారి వైపు పార్కింగ్ ప్రదేశాల వివరాలు: కడప వైపు నుండి ఒంటిమిట్ట వచ్చే భక్తుల కొరకు 13 ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాటు చేయడమైనది.
- ఫోర్ వీలర్స్ కు జనరల్ పార్కింగ్ —–చలమయ్య యాదవ్ సైట్..మాధవరం 1 (హెచ్ పి పెట్రోల్ బంక్ తూర్పు
వైపున) - త్రీ వీలర్స్ కు పార్కింగ్ —–కనకదుర్గ కళ్యాణ మండపంకు పడమటి వైపున ..మాధవరం1
- కార్ పార్కింగ్ —–కనకదుర్గ కళ్యాణ మండపం తూర్పు వైపున …మాధవరం 1
- కార్ పార్కింగ్ —– సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి ధాబా తూర్పు వైపు
- కార్ పార్కింగ్ —– సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి ధాబా పడమటి వైపు
- కార్లు, ట్రాక్టర్ లు, లారీ ల పార్కింగ్ — ఫోర్ వీలర్లకు సన్నీ ఫుడ్ కోర్ట్ నుండి పడమటి వైపు సాయిబాబా
గుడి, ఉప్పరపల్లి గ్రామం(ట్రాఫిక్ మళ్లింపు ప్రదేశం) - కార్ పార్కింగ్— ప్రాధమిక ఆరోగ్య కేంద్రం , కొత్త మాధవరం(ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎదురుగా)
- ఆర్.టి.సి బస్సుల పార్కింగ్ – శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్/ స్పైసెస్ బోర్డు మధ్యలో
- ఫ్రీ బస్సులు, వి.ఐ.పి కార్ పార్కింగ్ — శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, రాయలసీమ హోటల్ (వి.వి.ఐ.పి &
వి.ఐ.పి ఎంట్రెన్సు ఆర్చి ఎదురుగా) - పోలీసు వాహనాల పార్కింగ్ —ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ & మయూర హోటల్ మరియు వెనుక వైపు
- ఇతర శాఖల వాహనాల పార్కింగ్ — ఈద్గా పక్కన, ఒంటిమిట్ట (కార్ పార్కింగ్)
- టి.టి.డి వాహనాల పార్కింగ్ —కళ్యాణ వేదిక ప్రధాన ప్రవేశం ఆర్చ్ వద్ద ఉన్న సత్రం వద్ద
- టూ వీలర్, కార్ పార్కింగ్ – కళ్యాణ రామ టౌన్ ship & బ్రిడ్జి ప్రక్కన, దర్జిపల్లి రోడ్, కొత్త పల్లి గ్రామ సమీపంలో
👉🏽 రాజంపేట రహదారి వైపు పార్కింగ్ ప్రదేశాల వివరాలు:
- ఆర్.టి.సి బస్సు పార్కింగ్ —సాలాబాద్ క్రాస్ వద్ద
- ఫోర్ వీలర్ , టూ వీలర్ పార్కింగ్—మదరసా, మలకాటి పల్లి గ్రామం.
- ఫోర్ వీలర్, టూ వీలర్ పార్కింగ్—మలకాటి పల్లి గ్రామం వద్ద.
- వి.ఐ.పి కార్ పార్కింగ్ —–బి.సి బాయ్స్ హాస్టల్, ఒంటిమిట్ట టౌన్
- వి.ఐ.పి కార్ పార్కింగ్ —- దుర్గమ్మ గుడి ముందు వైపు, ఒంటిమిట్ట టౌన్.