విద్యాభ్యాసం పైన దృష్టి సారించాలి.
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ విజ్ఞాన్ జ్యోతి డిజి హై స్కూల్ ప్రిన్సిపల్ చలపతి గారు, మరియు గాయత్రి నగర్ జెన్ నెక్స్ట్ స్కూల్ జితేందర్ గార్ల ఆహ్వానం మేరకు స్కూల్ అన్యువల్ డే ప్రోగ్రామ్స్ లలో ఈరోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులు గాని ఎట్టి పరిస్థితుల్లోను వారి విద్యాభ్యాసం పైన దృష్టి సారించి ఏ రంగంలోనైతే వారు ఉత్సాహం చూపుతారో వారికి వెన్నంటు ఉండి మంచి మార్గాన్ని చూపించే బాధ్యత తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులదేనని ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు తెలిపారు.


