బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
సబీహా గౌసుద్దీన్*
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ కమ్యూనిటీ హాల్లో ఈరోజు డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకల్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గారు బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను చిరఃస్మరణీయమన్నారు. అలాగే బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, నరసింహ మాస్టర్, బొల్లు శ్రీనివాసరావు, జాహీద్ షరీఫ్ బాబా, రామ్ రెడ్డి, విజయ్ గౌడ్, బాల్ రాజ్, మల్లికార్జున్, బ్రహ్మ, సతీష్, ఏసు రత్నం, కృష్ణ, భీమ్ రాజ్, యోగి రాజ్, ఆంజనేయులు, రాజు, నవీన్, పార్వతమ్మ, సన్నజాజుల లక్ష్మి, మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.