సర్వే నంబర్ 145, 163 లో నిర్మాణ అనుమతులు ఇవ్వండి…
మేడ్చల్ కలెక్టర్ ను కోరిన ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు…

కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని kphb కాలనీ డివిజన్ హైదర్ నగర్ గ్రామ సర్వే నంబర్ 145, 163 పార్ట్ లలో ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులు జారీ చేయాలని కోరుతూ ఎం ఎల్ ఏ మాధవరం కృష్ణారావు గారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రును బుధవారం కలిసి కోరారు. గత మార్చి నెల నుంచి ఇక్కడి సర్వే నంబర్ లలోని సాయి నగర్, సర్దార్ పటేల్ నగర్, వసంత నగర్, భగత్ సింగ్ నగర్, సీబీసీఐడీ కాలనీ, ఎన్ ఆర్ ఎస్ ఏ కాలనీ, ఎస్.ఎస్.కాలనీ లలో గత నలభై ఏళ్లు కిందటనే లే అవుట్ చేసి ఇళ్ల స్థలాలు గా అభివృద్ధి చేసారని అప్పటి నుంచి గత మార్చి నెల వరకు ఇళ్ల నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ మొదలుకొని మున్సిపాలిటీలు ghmc వరకు అనుమతులను జారీ చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గత నెల నుంచి ఇంతవరకు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతులను మంజూరు చేయకుండా ghmc అధికారులు కలెక్టర్ వద్దకు ఫైల్ పంపుతున్నారని. అకస్మాత్తుగా అనుమతులను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక సంవత్సరాలుగా లేని సమస్యలు అకస్మాత్తుగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

Leave a Reply