మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం.

ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టే ఏ పథకమైన ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త నాయకుడి పై ఉందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ గారు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పార్టీకార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య మూసాపేట యాదవ బస్తీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని అనుకుంటే సాధించి చూపెడతారని అందుకు నిదర్శనం ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అన్నారు. దేశంలో ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.ఈ పథకం ద్వారా లక్షల మంది పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.గతంలో లావు రకం బియ్యం లబ్ధిదారులు అమ్ముకునేవారని ప్రస్తుతం ఈ సన్న బియ్యం పంపిణీ ద్వారా అలాంటి పరిస్థితి ఏర్పడదన్నారు. అదేవిధంగా పేద, వెనుకబడిన యువతకు ఆర్దికంగా చేయూతనిచ్చేందుకు రాజీవ్ యువశక్తి పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుండి నాలుగు లక్షల వరకు ఆర్దిక సాయాన్ని అందిస్తారని ఇందులో 75 శాతం సబ్సిడీ ఇవ్వడం ద్వారా యువతకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు ఈ పథకాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలన్నారు. మరియు అక్కడ ఏర్పాటు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజలందరూ కార్యకర్తలందరూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. బండి రమేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply