స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ
కూటమి బలోపేతానికి తేరా పడుతుందా ?

టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఏప్రిల్ మొదటి వారంలో టీడీపీ ముఖ్య నేతలతో నారా లోకేష్ భేటీ
హైదరాబాద్ ; తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చర్చలు చేస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణను అతి త్వరలోనే ప్రకటిస్తామని తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించగా 1.60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు.తెలంగాణలో కూడా పార్టీని పునఃనిర్మించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.తెలంగాణ ప్రజల మదుల్లో ఇప్పటికీ టీడీపీపై ప్రేమ అలానే ఉంది. అందుకు ఇటీవల స్వచ్ఛందంగా 1.60లక్షల మందికి పైగా పార్టీ సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్నారని తెలిపారు.టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు.
గతంలో మాట్లాడిన సిఎం చంద్రబాబు …తెలుగు జాతి కోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారని తెలిపారు. ఉమ్మడి ర