ఏఐసీసీ మరియు టిపిసిసి పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్*
బాలానగర్ సామ్రాట్ హోటల్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం,తెలంగాణ రాష్ట్ర మహిళ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభరాణి గార్ల ఆధ్వర్యంలో జరిగిన జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు టిపిసిసి సభ్యులు, కోఆర్డినేటర్స్,నియోజకవర్గం ఇంచార్జిలతో కలిసి పాల్గొన్నారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ గారు సార్వభౌమత్వ,సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి నా చిత్త శుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..
✅ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకెళ్లాలన్నారు..
✅ ఇటీవలే బిజెపి పార్టీ మహాత్మా గాంధీ గారి వారసత్వాన్ని, స్వాతంత్ర సమరయోధులను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం చాలా బాధాకరం అన్నారు..
✅ కుల,మత,ప్రాంత,లింగ,ధనిక,పేద లాంటి ఏ రకమైన బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కులు,బాధ్యతలు కల్పించిన ఈ గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు..
✅బిజెపి పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు..
✅మన రాష్ట్రంలో జిల్లాస్థాయి,మండల స్థాయి, బ్లాక్ స్థాయి, గ్రామస్థాయిలలో జై బాపు..జై భీమ్..జై సంవిధన్.. కార్యకలాపాలు పాదయాత్రలు నిర్వహించాలని డివిజన్ నాయకులకు సూచించారు..
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఉస్మా షాకీర్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి భూపతిరెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి,జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, టిపిసిసి స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం, మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ అసెంబ్లీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, కూకట్ పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్,కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి, బ్లాక్ స్థాయి పార్టీ నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు..