ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త

ఢిల్లీ సీఎం గా రేఖ గుప్త… Congratulations. మేడం…💐💪🔥 Rajanikanth Pabba Gupta FAMILY FDSDelhi New CM: కార్పొరేటర్ నుంచి సీఎం వరకు – రేఖా గుప్తా విజయయాత్ర

రాజకీయ అనుభవం లేకపోయినా, ప్రజాసేవే తన బలంగా నిలిపుకున్న రేఖా గుప్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేయలేదు. కానీ విద్యార్థి దశలోనే ABVP ద్వారా రాజకీయ ప్రవేశం చేసి, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు.

పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి కార్పొరేటర్‌గా విజయాలు సాధించి, ప్రజల నమ్మకాన్ని పొందారు. 2015, 2020లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా, 2025లో 29,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె, పదవులకతీతంగా ప్రజల్లో ఉండే నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ పట్ల ఆమె నిబద్ధత, పార్టీపై ఉన్న విశ్వాసమే ఆమెను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చాయి. “కార్పొరేటర్‌గా మొదలైన ప్రయాణం.. ముఖ్యమంత్రిగా నిలిచిన ఘనత!” 🚀🔥