శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం(వెండి బంగారు కీరిటములు
ఆభరణాలు) అప్పగించారు
13 .02 .25 గురు వారం నాడు కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో ఈ రోజు కూకట్ పల్లి స్థానికులు, దాతలు ఇచ్చిన బంగారం , వెండి (బంగారు కీరిటములు/ఆభరణాలు) వస్తువులు అందరి సమక్షంలో ఎండోమెంట్ కమిటీ వారికీ గౌరవ శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు అప్పగించారు.
ఈ కార్యక్రమం లో యం ఎల్. ఎ గారు మాట్లాడుతూ సుమారుగా 637 గ్రాములు బంగారం, సుమారు 500 గ్రాములు వెండి వస్తువులు అప్పగించడం జరిగింది వీటిని ప్రతి పండుగలకు స్వామివారికి అలంకరించటం జరుగుతుందని అలాగే రామాలయం పక్కన ఉన్న స్థలం యజమానులతో మాట్లాడి వాటికి సంబంధించి బ్రాహ్మణులకు నివాసయోగ్యం కొరకు మరియు వంటశాలగా ఉపయోగించడం కొరకు ఆలోచన చేస్తున్నామని అలాగే 20 అడుగుల హనుమంతు విగ్రహం ఏర్పాటు చేయటానికి శిల్పులు సింపుల్ నుండి డ్రాయింగ్స్ తెప్పించడం జరిగిందని, ఇప్పటికే రామాలయానికి దాతలు ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రతి పండుగలు వచ్చే భక్తులకు సౌకర్యాలు అన్నీ కల్పించాలని మొదటగా వచ్చిన వారికి పూజలు జరిపించాలని వారికి ఎటువంటి ఇబ్బందులకు తలెత్తకుండా చూడాలని ఈవో సూచించారు రామాలయం అందరిదీ కాబట్టి అందరికీ సమానంగా పూజ జరిపించాలని రామాలయంలో ఇంతక ముందు కన్నా ఆదాయం పెరిగిందని కాబట్టి శ్రీరామనవమి ఇతర పర్వదినాలలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఎక్కువ నిధులు వచ్చేటట్టుగా ప్రయత్నించాలని ఈఓ తెలిపారు ప్రసాదం ప్రతిరోజు భక్తులకు అందించాలని సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకురావాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ. రోజా రంగారావు, తులసీరామ్ సూర్యరావు దేవాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నా