తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నూతన ఇంచార్జి
హైదరాబాద్:ఫిబ్రవరి 15
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈమె మధ్యప్రదేశ్ లోని మాండ సౌరు, లోక్ సభ స్థానం నుంచి 2009-14 మధ్య ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ.. కేసీ వేణు గోపాల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్ టీమ్‌లో మీనాక్షి నటరాజన్ కీలకం గా ఉన్నారు. తెలంగాణతో పాటు.. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ల ను ప్రకటించింది,
ఏఐసీసీ. మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజ న్.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్ లలో అలాగే.. ఏఐసీసీ లో కీలక బాధ్యతల్లో పనిచేశారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్ సభ్యురాలిగా గుర్తింపు పొందారు.
అలాగే, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంఛార్జిగా రజనీ పాటిల్; హరియాణా- బీకే హరిప్రసా ద్, మధ్యప్రదేశ్ – హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్ఛేరి- గిరీశ్ చోడాం కర్; ఒడిశా – అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ – కె.రాజు తో పాటు…
మణిపుర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ – సప్తగిరి శంకర్ ఉల్కా, బిహార్ -కృష్ణ అల్లవారులను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికా ర్జున ఖర్గే నిర్ణయించినట్లు శుక్రవారం రాత్రి ఏఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది