కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది.*
అర్హులైన లబ్ధిదారులు మీ దగ్గరలోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోగలరు.
దరఖాస్తు చేసుకోవడానికి నిర్దిష్ట సమయం ఏమీ లేదని, దరఖాస్తు ప్రక్రియ నిరంతరం ఉంటుందని ప్రజలు గమనించాలని ప్రభుత్వం పత్రికల ద్వారా ప్రకటన ఇవ్వడం జరిగినది.
అసలు రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చును.
రేషన్ కార్డు ఉండి దానిలో తప్పులు ఉన్నట్లయితే ఉదాహరణకు: మీ పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, అడ్రస్సు, పుట్టిన తేదీలలో మార్పులు ఉన్నట్లయితే మార్చుకొనవచ్చును. మరియు ఆడవారికి మగవారని, మగవారికి ఆడవారని ఉన్నా మార్చుకోవచ్చును.
రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డులో మీ కుటుంబ సభ్యుల పేర్లు గల్లంతయినట్లయితే మరల చేర్చుకోవచ్చును.
రేషన్ కార్డు ఉండి మీకు పిల్లలు పుట్టినట్లయితే పిల్లల పేర్లు చేర్చుకొనవచ్చును. మీకు వివాహము అయిన తరువాత మీ కొత్త దంపతులకు సపరేట్గా రేషన్ కార్డు కావాలి అని అనుకుంటే…. మీ కుటుంబ సభ్యుల రేషన్ కార్డులో మీ పేరును తొలగించుకుని తరువాత ఆలుమగలు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకొనవచ్చును.
*మీ కుటుంబ సభ్యుల ఆధార్ జిరాక్స్ కాపీలు మీరు ఏ ఇంటిలో ఉంటున్నారో ఆ ఇంటి కరెంట్ బిల్లు తీసుకుని మీ సేవలో ఇవ్వవచ్చును