కాంగ్రెస్ పార్టీ తోనే యువత
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 50,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు*
ఫోర్త్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరుగుతుంది
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనతో ఎన్నో కంపెనీల రాక
కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు
కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో యువత చేరిక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 50 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర యువత ఉందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సోమవారం ఎస్ఎస్ఆర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శేరి సతీష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారన్నారు. విదేశీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల యువతకు ఉపాధి రంగాల్లో అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శేరి భువన్ రెడ్డి,పీటర్ వీరా, Grp నాయక్, సాయి, గణేష్,లోకేష్, అరవింద్, అశోక్, వెంకీ, దినేష్,సందీప్